వికారాబాద్ హత్యాచారం కేసు..ఒప్పుకున్న నిందితుడు!

వికారాబాద్ హత్యాచారం కేసు..ఒప్పుకున్న నిందితుడు!

వరంగల్ టైమ్స్ , వికారాబాద్ జిల్లా : వికారాబాద్‌ విద్యార్థిని కేసులో పురోగతి కనిపిస్తోంది. పదో తరగతి విద్యార్థినిపై ఆమె స్నేహితుడే హత్యాచారానికి పాల్పడినట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది.ప్రధాన నిందితుడు మహేందర్‌ అలియాస్‌ నాని నేరం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాగిన మైకంలో లైంగిక వాంఛ తీర్చమని సదరు విద్యార్థినిని నిందితుడు బలవంత పెట్టాడు. అయితే ఆమె ఒప్పుకోకపోవడంతో తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తలను చెట్టుకు బాది.. ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. కీలక ఆధారాలతో పోలీసులు నేడు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.వికారాబాద్ హత్యాచారం కేసు..ఒప్పుకున్న నిందితుడు!వికారాబాద్‌ పూడూర్‌ మండలం అంగడి చిట్టంపల్లిలో సోమవారం ఉదయం 16 ఏళ్ల విద్యార్థిని అత్యాచారం, హత్య కేసు సంచలన సృష్టించింది. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఇంటి నుంచి 500 మీటర్ల నిర్మానుష్య ప్రాంతంలో విగతజీవిగా పడి ఉంది. నిర్మానుష్య ప్రాంతంలో బాలిక దుస్తులు చెల్లా చెదురుగా పడి ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో బాధితురాలి తల్లి పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో.. ఆమెను కూడా ప్రశ్నించారు. నిందితుడు ఒక్కడేనా? లేదా జరిగింది సామూహిక హత్యాచారమా? అన్నది ఇవాళ్టి పోలీసుల ప్రెస్‌ మీట్‌లో వెల్లడయ్యే అవకాశం ఉంది.