ఆదివారం సాయితేజ అంత్యక్రియలు

ఆదివారం సాయితేజ అంత్యక్రియలుఅమరావతి : హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేత అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. ఈ ఘటనలో 13 మంది చనిపోగా వారిలో కొంతమంది మృతదేహాలను ఆ రోజే గుర్తించారు. అందులో ఆరుగురి మృతదేహాలను శనివారం గుర్తించి పోస్టుమార్టం నిర్వహించారు.

కాగా సాయితేజ మృతదేహాన్ని చిత్తూరు జిల్లాలోని స్వగ్రామానికి సాయంత్రం వరకు చేరుకుంటే, ఆదివారం రోజు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సాయితేజ తమ్ముడు మహేశ్ వెల్లడించాడు. మృతదేహాన్ని ఆదివారం తమకు అప్పగించాలని ఆయన ఆర్మీ అధికారులను కోరినట్లు సమాచారం. కాగా , సాయితేజ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించడానికి ఆర్మీ అధికారులు గ్రామానికి చేరుకుని ఏర్పాట్లు చేస్తున్నారు.