రేపు వేములవాడ రాజన్న దర్శనానికి బ్రేక్

రేపు వేములవాడ రాజన్న దర్శనానికి బ్రేక్రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. జనవరి 13న ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున ఆలయంలో కొవిడ్‌ ఆంక్షలు విధించారు.

ముక్కోటి ఏకాదశి రోజున ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు. స్వామివారికి ఏకాంతంగా పూజలు చేయనున్నట్లు తెలిపారు. పరిమిత సంఖ్యలో వేదపండితులు, అర్చకులతో స్వామివారికి ఏకాంత సేవలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.