అయాన్ ఫౌండేషన్ సేవలు భేష్ : దాస్యం విజయ్ భాస్కర్

అయాన్ ఫౌండేషన్ సేవలు భేష్ : దాస్యం విజయ్ భాస్కర్హనుమకొండ జిల్లా : పేద ప్రజల కోసం అయాన్ ఫౌండేషన్ చేస్తున్న సామాజిక, సేవా కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర జాగృతి ఉపాధ్యక్షులు, మాజీ కార్పోరేటర్ దాస్యం విజయ భాస్కర్ కొనియాడారు. అయాన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎండీ. అన్వర్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నిస్నేహనగర్ లోని తన కార్యాలయం ఎదుట దాస్యం విజయ్ భాస్కర్ ప్రారంభించారు.

అయాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. చలికి వణుకుతూ నిరుపేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూడలేక అయాన్ ఫౌండేషన్ దుప్పట్లు పంపిణీ చేయడం అభినందించదగిన విషయమని దాస్యం విజయ్ భాస్కర్ అన్నారు.

అంతేకాకుండా గత కొంత కాలం నుంచి పేద ప్రజల కోసం అయాన్ ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర జాగృతి ఉపాధ్యక్షులు కొనియాడారు. నేటి యువతరానికి అయాన్ ఫౌండేషన్ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని ఆయన సూచించారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న అన్వర్ కు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

మానవ సేవే..మాధవ సేవ అనే ఆలోచనతోనే కుల మతాలకు అతీతంగా సేవ చేస్తున్నానని అయాన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎండీ. అన్వర్ తెలిపారు. పేద ప్రజల సమస్యలు తీర్చడమే తమ ఏకైక లక్ష్యమని అయాన్ పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే అదృష్టాన్ని తమకు కల్గించినందుకు దేవుడికి కృతజ్ఞుడనవుతానని అన్నారు. ఈకార్యక్రమంలో అయాన్ ఫౌండేషన్ సభ్యులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.