ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన సీఎం

ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన సీఎంవరంగల్ టైమ్స్, అమరావతి: పీఎస్‌ఎల్‌వీ సీ-52 రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఈ విజయంతో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారత అంతరిక్ష సామర్థ్యాలను ఇస్రో మరింత ముందుకు తీసుకెళ్లిందని సీఎం జగన్‌ అన్నారు. భవిష్యత్‌లో ఇస్రో చేపట్టే అన్ని ప్రయోగాలు విజయం సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.