ఇస్రో కు చంద్రబాబు శుభాకాంక్షలు

ఇస్రో కు చంద్రబాబు శుభాకాంక్షలు

వరంగల్ టైమ్స్, అమరావతి: పీఎస్‍ఎల్వీ-సీ 52 రాకెట్ ప్రయోగం విజయవంతం పై ఇస్రో కు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా మూడు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు మరో రికార్డ్ సాధించారని అభినందించారు. నింగికి దూసుకు వెళ్ళే ఇస్రో రాకెట్లు ఇస్రో కీర్తిని మరింత ఎత్తుకు తీసుకు వెళ్ళాయని చంద్రబాబు అన్నారు. వ్యవసాయం, అటవీ, నీటి వనరుల సమాచారం కోసం రూపొందించిన ఆర్‍ఐశాట్-1 ఉపగ్రహంతో ప్రజలకు మరింత మేలు జరగాలని ఆకాక్షించారు. ప్రయోగం లో భాగస్వాములు అయిన సిబ్బందికి, శాస్త్రవేత్తలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.