సంక్రాంతి సెలవులు 5 రోజులే

సంక్రాంతి సెలవులు 5 రోజులే

సంక్రాంతి సెలవులు 5 రోజులేవరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఇందులో పాఠశాలలకు 5 రోజులు, కళాశాలలకు 3 రోజులు మాత్రమే సెలవులు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు జనవరి 13 నుంచి 17వరకు సెలవులు ఉండగా, 18న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఇక ఇంటర్‌ విద్యార్థులకు ఈ నెల 13 నుంచి 15 వరకే సెలవులు. ఈసారి భోగి రెండో శనివారం, సంక్రాంతి ఆదివారం రావడంతో విద్యార్థులు, టీచర్లు అసంతృప్తితో ఉన్నారు.