మేకపాటి మృతిపట్ల జనసేన దిగ్భ్రాంతి

మేకపాటి మృతిపట్ల జనసేన దిగ్భ్రాంతివరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి కన్నుమూశారనే విషయం నమ్మశక్యం కాలేదని ఆయన అన్నారు. మంచి సేవలు అందించాలని రాజకీయాల్లోకి వచ్చారని కొనియాడారు. కాగా గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో ఎల్లుండి నిర్వహించనున్నారు. ఆయన కుమారుడు అర్జున్ రెడ్డి అమెరికా నుంచి బయల్దేరారు. రేపు ఉదయం వరకు స్వస్థలానికి చేరుకున్నారు.