కిటెక్స్ అపెరల్ పార్కుకు భూమిపూజ చేసిన కేటీఆర్

కిటెక్స్ అపెరల్ పార్కుకు భూమిపూజ చేసిన కేటీఆర్

 వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కిటెక్స్ టెక్స్ టైల్ పరిశ్రమకు భూమిపూజ చేశారు. రూ. 1200 కోట్లు పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ సంస్థలో 11,100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 187 ఎకరాల భూమిని కేటాయించింది. అనంతరం మిషన్ భగీరథ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. కిటెక్స్ అపెరల్ పార్కుకు భూమిపూజ చేసిన కేటీఆర్

ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, నన్నపునేని నరేందర్, కిటెక్స్ అధికారులు పాల్గొన్నారు.