మదర్స్ డే స్పెషల్..తల్లులకు టీఎస్ ఆర్టీసీ ఆఫర్  

మదర్స్ డే స్పెషల్..తల్లులకు టీఎస్ ఆర్టీసీ ఆఫర్

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : మదర్స్ డే సందర్భంగా టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మే 8న మదర్స్ డే సందర్భంగా తల్లులకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ ఓ ప్రకటలో పేర్కొంది. 5 యేళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలతో వస్తే ఏసీ బస్సులతో సహా అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని ప్రకటించింది.మదర్స్ డే స్పెషల్..తల్లులకు టీఎస్ ఆర్టీసీ ఆఫర్  ఐతే ఈ ఆఫర్ ఒక్క మదర్స్ డే రోజు మాత్రమేనని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మదర్స్ డే అనే రోజు చాలా గొప్ప రోజని, మనందరినీ ఈ భూమి మీదకు తెచ్చిన తల్లులను ఎంతో గౌరవించాలని ఆయన సూచించారు.