టీఎస్ న్యూ సీఎస్ రేసులో రామకృష్ణారావు..!
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణకు కొత్త సీఎస్ ను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. తెలంగాణకు ఇప్పటి వరకు ఉన్న సీఎస్ సోమేశ్ కుమార్ ను కేంద్రం రిలీవ్ చేయడంతో కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీంతో సీఎస్ రేసులో ముగ్గురు అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి.వీరిలో ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఉన్నారు. అయితే వీరిలో కొత్త సీఎస్ గా రామకృష్ణారావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.