ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంకు, మంత్రికి కరోనా

ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంకు, మంత్రికి కరోనా

పాట్నా : బీహార్ రాష్ట్రంలో కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే సీఎం నితీష్ కుమార్ నిబంధనలు కఠినతరం చేశారు. అయినా కరోని విస్తృతి కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులకే వైరస్ సోకింది. డిప్యూటీ సీఎం రేణూ దేవి, మరో మంత్రి సునీల్ కుమార్ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల బీహార్ మాజీ సీఎం జితన్ రాయ్ మాంఝీకి, ఆయన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకింది.