సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన చీఫ్ విప్ దాస్యం

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన చీఫ్ విప్ దాస్యంహనుమకొండ జిల్లా : ఆపదలో ఉన్న అభాగ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక భరోసా కల్పిస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్భాంధవుడయ్యాడని కొనియాడారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాజీపేటలో అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురికి చీఫ్ విప్ చేయూతనందించారు.

బుధవారం కాజీపేటలో పర్యటించిన దాస్యం వినయ్ భాస్కర్ ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ సహాయ నిధి చెక్కులను అందచేశారు. సుమారు 8 మంది లబ్ధిదారులకు రూ.8 లక్షల 38,660 విలువ గల చెక్కులను చీఫ్ విప్ నేరుగా అందించారు. లబ్ధిదారుల ఆరోగ్య, కుటుంబ పరిస్థితులను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నుంచి చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తుందని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. సీఎం అందజేస్తున్న ఈ సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ కోరారు.