వరంగల్ టైమ్స్, హర్యానా: హర్యానాలోని సోనిపట్ సమీపం ఖార్ కోడా ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో పంజాబీ సినిమా నటుడు, సామాజిక కార్యకర్త దీప్ సిద్ధూ హఠాన్మరణం పొందారు. దీప్ సిద్ధూ ప్రయాణిస్తున్న కారు ఓ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దీప్ సిద్ధూ మరణించినట్లు సోనిపట్ పోలీసులు ధృవీకరించారు. దీప్ సిద్ధూ మరణం పట్ల పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ సన్నీ సంతాపం తెలిపారు.
కాగా , కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత యేడాది జనవరి 26న ఎర్రకోట వద్ద జరిగిన అల్లర్లతో దీప్ సిద్ధూ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఆ అల్లర్ల కేసులో ప్రధాన నిందితునిగా పేర్కొంటూ పోలీసులు ఆయనను రెండు సార్లు అరెస్ట్ చేశారు.