మూడో రోజు సజావుగా సాగిన రైతుబంధు

హైదరాబాద్ : 8వ విడత రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ సజావుగా కొనసాగుతున్నది. మూడో రోజు 1,051,384 మంది రైతుల ఖాతాల్లో రూ.13,020,657,990 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

మూడు రోజుల్లో 4,595,167 మంది రైతులకు రూ.31,020,432,279 రైతుబంధు సాయం అందించామన్నారు. ఈ యాసంగి సీజన్ లో 66.61 లక్షల మంది రైతులకు రూ.7,645.66 కోట్లు రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించనున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.