చలికాలంలో ఇవి తింటే జలుబు,దగ్గు ఫరార్.!

చలికాలంలో ఇవి తింటే జలుబు,దగ్గు ఫరార్.!

వరంగల్ టైమ్స్,హెల్త్ డెస్క్ : చలి విపరీతంగా పెరిగిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో మైనస్ డిగ్రీలకు చేరుకుంటుంది. ఈ చలికాలంలో చాలా మంది జబ్బుల బారిన పడుగతుంటారు. ముఖ్యంగా జలుబు,దగ్గు వంటి సమస్యలు వేధిస్తుంటాయి. కొన్నిసార్లు ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు. అయితే మన వంటగదిలో లభించే కొన్ని ఆహార పదార్థాలతో ఈ జలుబు, దగ్గుకు చెక్ పెట్టవచ్చు. అవేంటో ఓ సారి చూద్దాం.

చలికాలంలో ఇవి తింటే జలుబు,దగ్గు ఫరార్.!

1.అల్లం…
చలికాలంలో అల్లాన్ని ఉపయోగిస్తే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అల్లంలో థర్మోజెనిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీటి కారణంగా చల్లని వాతావరణంలో శరీరంలో వేడిని ఉత్పత్తి చేసేందుకు సహాయపడుతుంది. చలికాలంలో వెచ్చగా ఉండటానికి సహాయపడే నివారణ చర్యగా తమ ఆహారంలో అల్లాన్ని చేర్చుకోవాలి. డైరెక్టుగా అల్లం తినడం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆహారంలో కానీ టీలో కానీ దీన్ని తీసుకోవాలి. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇద శీతాకాలంలో వ్యక్తి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.

2.వెల్లుల్లి…
బహుళ ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆహారంలో ఒకటి వెల్లుల్లి. వెల్లుల్లితో ఆహారం రుచి అద్బుతంగా మారుతుంది. చికెన్ సూప్ లో వెల్లుల్లిని చేర్చితే మరింత రుచికరంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉంటాయి. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎంతగానో సహాయపడుతుంది. కావున మీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

3.నిమ్మ కాయ..
చలికాలంలో… నిమ్మకాయను తీసుకుంటే జలుబు మరింత పెరుగుతుందనుకుంటారు. కానీ… నిమ్మకాయను లికాలంలోనూ తీసుకోవచ్చు. ఈ సిట్రిక్ పండు నిజానికి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి , ఫైబర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్ డి-లిమోనెన్‌ ఉన్నాయి. ఇది నిమ్మకాయకు ప్రత్యేకమైన సువాసనను అందిస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తితో పాటు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ ఎంతగానో సహాయపడుతుంది.