అసెంబ్లీలో కేటీఆర్ అన్ స్టాపబుల్ స్పీచ్ !

అసెంబ్లీలో కేటీఆర్ అన్ స్టాపబుల్ స్పీచ్ !

అసెంబ్లీలో కేటీఆర్ అన్ స్టాపబుల్ స్పీచ్ !

 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : సాధారణంగా అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతుంటే అంతా టీవీలకు అతుక్కుని పోతారు. కేసీఆర్ ప్రతీ మాట బుల్లెట్ లా పేలుతుంటే, కళ్లార్పకుండా చూస్తూ, చెవులారా వింటూ మైమరిచిపోతారు. వారెవ్వా సారు ఏం మాట్లాడిండు అంటూ మురిసిపోతారు. అలా కేసీఆర్ లా మాటల తూటాలు పేల్చడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన ప్రతీ మాట ఓ ఆణిముత్యం. ప్రతీ డైలాగూ ఆలోచన రేకెత్తించేదే. శనివారం అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగం కూడా అదే కోవలోకి వస్తుంది. అంతలా కేటీఆర్ చారిత్రాత్మక ప్రసంగం చేశారు.

*వన్ మ్యాన్ షో..అదరహో..
గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో శనివారం కేసీఆర్ మాట్లాడుతారని అందరూ ఆశించారు. కానీ ఆ బాధ్యతను మంత్రి కేటీఆర్ తన భుజ స్కందాలపై వేసుకున్నారు. అనర్గళ ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ప్రతీ సబ్జెక్ట్ ను టచ్ చేస్తూ హుందాగా మాట్లాడారు. క్లియర్ కట్ గా చెప్పాలంటే వన్ మ్యాన్ షోతో అదరగొట్టారు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడే అటాకింగ్ టీ-20 బ్యాట్స్ మెన్ లా సూపర్ బ్యాటింగ్ చేశారు. అందుకే కేటీఆర్ ప్రసంగానికి అందరూ ఫిదా అయ్యారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు కూడా అసెంబ్లీ బయట కేటీఆర్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోయారట. అంతలా కేటీఆర్ తనదైన వాగ్ధాటితో ఆకట్టుకున్నారు.

*ఆ పార్టీకి స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చాడు..
అసెంబ్లీలో ప్రసంగం సందర్భంగా మంత్రి కేటీఆర్ లోడెడ్ గన్ లా ఉత్సాహంగా కనిపించారు. ఆయన మాట్లాడిన కొన్ని మాటలు తూటాల్లా పేలాయి. కేసీఆర్ ఉన్నంత వరకు బీజేపీ పప్పులుడకవ్ అన్న మాటతో కమలం పార్టీకి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు కేటీఆర్. రైతాంగ ప్రయోజనాల విషయంలో రాజీ లేదంటూ ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని స్పష్టం చేశారు. మోటర్లకు మీటర్లు పెట్టే కుట్రలను సహించేది లేదంటూ మోదీ సర్కారుకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తద్వారా అన్నదాతలకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. ఇది కచ్చితంగా రైతు ప్రభుత్వమేనని కేటీఆర్ చాటుకున్నారు.

* బరాబర్ కుటుంబ పాలనే..
కుటుంబపాలన అంటూ విమర్శలు చేసే ప్రతిపక్షాలకు మూతోడ్ జవాబిచ్చారు కేటీఆర్. తెలంగాణ అంతా మా కుటుంబమే అని చెప్పడం ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బరాబర్ కుటుంబపాలనే, తెలంగాణ వసుధైక కుటుంబం అనే డైలాగు ద్వారా కేసీఆర్ ను తలపించారు కేటీఆర్.

*రివర్స్ పంచ్ లతో బీజేపీని తూర్పారపట్టిన కేటీఆర్
దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడే బీజేపీ నేతలకు అదే భాషలో రివర్స్ పంచ్ వేశారు కేటీఆర్. దేశం కోసం ధర్మం కోసం అంటూ డైలాగులు తప్ప చేసిందేమీ లేదని తనదైన శైలిలో మోడీ సర్కారును తూర్పార బట్టారు. ఉచితాలు వద్దంటూ కార్పొరెట్లతో దోస్తానా చేస్తున్నారని ఎండగట్టారు. ముఖ్యంగా కార్పొరెట్లతో దోస్తానాను హైలైట్ చేయడం ద్వారా అందానీ అంశం తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పారు. కాళేశ్వరానికి లక్ష కోట్లు ఖర్చు చేశారన్న బీజేపీ ఆరోపణలకు సరైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు కేటీఆర్. మరి అహ్మదాబాద్ లో బుల్లెట్ ట్రైన్ కు లక్ష కోట్ల కంటే ఎక్కువ ఎందుకు ఖర్చు పెట్టారంటూ ఏకిపారేశారు.

*అన్ని వర్గాలను ఆకట్టుకున్న కేటీఆర్ ప్రసంగం
రివర్స్ పంపింగ్ కు కేరాఫ్ కాళేశ్వరం, రివర్స్ మైగ్రేషన్ కు కేరాఫ్ పాలమూరు అంటూ రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని చెప్పకనే చెప్పారు. బీసీలంటే బ్యాక్ బోన్ ఆఫ్ తెలంగాణ అంటూ బలహీనవర్గాల ప్రజలను ఆకట్టుకున్నారు. దళితబంధు ప్రస్తావన తెచ్చి, వారి సంక్షేమమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఇలా అన్ని వర్గాలను ప్రస్తావిస్తూ కేటీఆర్ చేసిన సుదీర్ఘ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

*కేటీఆర్ అన్ స్టాపబుల్ స్పీచ్ కి అందరూ ఫిదా ..
తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో కేటీఆర్ అనర్గళ ప్రసంగానికి అందరూ మంత్ర ముగ్ధులయ్యారు. గతాన్ని గుర్తు చేస్తూ, వర్తమానాన్ని వివరిస్తూ, భవిష్యత్తును కళ్లకు కడుతూ ఆయన చేసిన ప్రసంగం అదరహో అనిపించింది. పంచు డైలాగులు, ప్రతిపక్షాలపై సెటైర్లు, పక్కా లెక్కలతో కేటీఆర్ ప్రసంగం అన్ స్టాపబుల్ గా సాగింది. సీఎం కేసీఆర్ కు ఏమాత్రం తీసిపోని విధంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.తండ్రికి తగ్గ తనయుడినని మరోసారి చాటుకున్నారు.