చెన్నై పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం 

చెన్నై పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. మొదట పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లియామ్ లివింగ్ స్టోన్ ( 32 బంతుల్లో 60 ; 5 ఫోర్లు, 5 సిక్సర్లు ) దంచికొట్టగా, శిఖర్ ధవన్ ( 33; 4 ఫోర్లు, ఒక సిక్సర్ ), జితేశ్ ( 26 ; 3 సిక్సర్లు ) రాణించారు. చెన్నై బౌలర్లలో జోర్డాన్, ప్రిటోరియస్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. చెన్నై పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం అనంతరం ఛేదనలో చెన్నై 18 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. శివమ్ దూబే ( 30 బంతుల్లో 57 ; 6 ఫోర్లు, 3 సిక్సర్లు ) టాప్ స్కోరర్ కాగా, మహేంద్ర సింగ్ ధోనీ ( 28 బంతుల్లో 23 ; 1 ఫోర్ , 1 సిక్సర్ ) ధాటిగా ఆడలేకపోయాడు. ఊతప్ప ( 13 ), గైక్వాడ్ (1), మోయిన్ అలీ (0), అంబటి రాయుడు ( 13), కెప్టెన్ రవీంద్ర జడేజా (0), బ్రేవో (0) విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 3, వైభవ్, లివింగ్ స్టోన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. లివింగ్ స్టోన్ కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్ లో భాగంగా సోమవారం లక్నోతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.