అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు 

అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు

వరంగల్ టైమ్స్ , ఇంటర్నెట్ డెస్క్ : హెచ్ 5 బర్డ్ ఫ్లూ తొలి కేసు అమెరికాలో నమోదైంది. కొలరాడోలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు ఆ దేశ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ ( సీడీసీ ) పేర్కొన్నది. ఏవియన్ ఇన్ ఫ్లూయాంజా ఏ(హెచ్5) పరీక్షలో ఆ వ్యక్తికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోళ్ల పరిశ్రమలో అతను పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడే అతనికి హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ సోకి ఉంటుందని భావిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి అలసటగా ఉన్నట్లు ఆ పేషెంట్ తెలిపాడు. ప్రస్తుతం అతను కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు.అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు హెచ్5 పాజిటివ్ వ్యక్తిని ఐసోలేట్ చేసి, అతనికి సెల్టమవిర్ ఔషధాన్ని ఇస్తున్నట్లు సీడీసీ తెలిపింది. గత సంవత్సరం అమెరికా పౌల్ట్రీ కేంద్రాల్లో హెచ్5 ఎన్ 1 వ్యాధి విస్తరించింది. అయితే ఆ వ్యాధి లక్షణాలను మానిటర్ చేస్తున్నట్లు సీడీసీ వెల్లడించింది. హెచ్5ఎన్1 మనుషులకు సోకడం ఇది రెండవ కేసు అని, తొలి కేసు బ్రిటన్ లో 2021 డిసెంబర్ లో నమోదైనట్లు అధికారులు తెలిపారు.