కరోనా నుంచి కోలుకున్న కాంగ్రెస్‌ నేత వీహెచ్‌

హైదరాబాద్‌: కరోనాతో వైరస్ తో ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ హనుమంత్‌ రావు దంపతులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కొద్ది రోజుల క్రితం వీరిద్దరు అనారోగ్యంతో వైద్య పరీక్షలు నిర్వహించుకోగా కరోనా నిర్ధారణ కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వీహెచ్‌ దంపతులు చేరారు. దాదాపు పదిరోజులు చికిత్స పొందిన అనంతరం రెండు రోజుల క్రితం మరోసారి వైద్యులు వారికి కరోనా పరీక్షలను నిర్వహించారు. రిపోర్ట్ లో నెగిటివ్‌ రావడంతో బుధవారం దంపతులిద్దరినీ వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.