31 వ‌ర‌కు లాక్‌డౌన్‌..తెలంగాణ స‌ర్కార్ ఉత్త‌ర్వులు

హైదరాబాద్ : క‌రోనా కేసుల తీవ్ర‌త‌తో.. తెలంగాణలో మ‌ళ్లీ లాక్‌డౌన్ విధిస్తార‌నే చ‌ర్చ సాగింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో మ‌ళ్లీ పూర్తిగా లాక్‌డౌన్ విధించేందుకు స‌ర్కార్ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు కూడావార్త‌లు వ‌చ్చాయి.. ఈ త‌రుణంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది ప్ర‌భుత్వం. రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడగిస్తూ ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఉత్త‌ర్వుల్లో కలెక్టర్లను ఆదేశించింది స‌ర్కార్. రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. ఈ కొత్త మార్గదర్శకాలు తక్షణం అమలులోకి వస్తాయని స్ప‌ష్టం చేసింది.

కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు:
తెలంగాణలో రాత్రి 9.30 గంటల లోపల అన్ని షాపులు మూసేయాలి.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమ‌ల్లో క‌ర్ఫ్యూ.
కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు.
లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి.