ఘనంగా 11వ రోజు భద్రకాళి శాకంబరి ఉత్సవాలు

వరంగల్: శ్రీభద్రకాళి శాకంబరి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయము బలకా క్రమంలో భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళి అమ్మవారు. సాయంత్రము విజయా క్రమంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఘనంగా 11వ రోజు భద్రకాళి శాకంబరి ఉత్సవాలుప్రతియేడు ఆశాఢమాసంలో జరిగే శాకాంబరి ఉత్సవాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకునేవారు. అయితే ఈ యేడాది మాత్రం భక్తుల రాక తగ్గిందనే చెప్పవచ్చు. కరోనా వైరస్ ప్రభావంతో ఆలయాల్లో భక్తల రద్దీ తగ్గుముఖం పట్టింది. ఆలయంలో కోవిడ్ మరియు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తు.. ఆలయ ప్రధాన ఆర్చకులు అమ్మవారికి నిత్యారాధనలతో పాటు శాస్త్రోక్తంగా శాకంబరి అవతారాల్లో అలంకరిస్తు.. భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కలిపిస్తున్నారు. భక్తులు సైతం కోవిడ్ నిబంధనలు పాటిస్తు.. భద్రకాళి అమ్మవారి శాకంబరి అవతరాలను తిలకించి ధన్యులవుతున్నారు.