ఐదుగురికి ప్రత్యేక బాధ్యతలిచ్చిన కాంగ్రెస్ పార్టీ
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధిష్టానం కీలక ప్రకటన చేసింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో పరాభవం తర్వాత ఉన్న పరిస్థితులను ఆకళింపు చేసుకోవడం, పార్టీలో సంస్థాగతంగా ఎలాంటి మార్పులు చేయాలి, కొత్త వారిని ఏఏ పద్ధతుల్లో నియమించాలి అన్న విషయాలను అధ్యయనం చేయాలని, సలహాలు ఇవ్వాలని సీనియర్ సభ్యులను ఆదేశించింది. ఈ కమిటీలో జైరాం రమేష్, రజనీ పాటిల్, అజయ్ మాకెన్, జితేంద్ర సింగ్, అవినాశ్ పాండే సభ్యులుగా ఉంటారు.ఈ ఐదుగురు పై అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారని పార్టీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరుతో ఓ లేఖ విడులైంది. రజనీ పాటిల్ ( గోవా ), జయరాం రమేష్ ( మణిపూర్ ), అజయ్ మాకెన్ ( పంజాబ్ ), జితేంద్ర సింగ్ ( యూపీ ), అవినాశ్ పాండే ( ఉత్తరాఖండ్ ). కాంగ్రెస్ అధిష్టానం వీరికి ఈ రాష్ట్రాల బాధ్యతలను అప్పగించింది. వీరందరూ తమకిచ్చిన రాష్ట్రాల్లో ఓటమి తర్వాత పరిస్థితులు, సంస్థాగత ఏర్పాట్లు, నియామకాలపై అధ్యయనం, సలహాలు చేయనున్నారు.