రైల్వేలో ప్రైవేటీకరణ లేదు : మంత్రి అశ్వినీ వైష్ణవ్
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : రైల్వేలను ప్రైవేటీకరించడం లేదని, అది కేవలం ఊహాజనితమైన వాదన అని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. నేడు లోక్ సభలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. రైల్వే ప్రైవేటీకరణపై చర్చించలేదని, ప్లానింగ్ కూడా లేదని తెలిపారు. రైళ్లు, బోగీలు, ట్రాక్ లు, స్టేషన్లు, ఇంజిన్లు, విద్యుత్తు తీగలు, కోచ్ లు, సిగ్నలింగ్ వ్యవస్థ మొత్తం రైల్వేకే చెందుతోందని, ఎలా రైల్వే ప్రైవేటీకరణ జరుగుతుందని, ఎక్కడా అలా జరుగడం లేదని మంత్రి స్పష్టం చేశారు. రైల్వే శాఖ గ్రాంట్స్ పై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి వివరణ ఇచ్చారు. రవాణా రైళ్లను ప్రైవేట్ పరం చేస్తున్నట్లు వస్తున్నఆరోపణలను ఆయన ఖండించారు. రవాణా రైళ్లను ప్రైవేటీకరించడంలేదన్నారు. రైల్వే శాఖలో ఉద్యోగాల భర్తీ వేగంగా జరుగుతోందని, తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 3 లక్షల రైల్వే ఉద్యోగాలు ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. రైల్వే రిక్రూట్మెంట్ పై ఎక్కడా బ్యాన్ విధించలేదన్నారు. అంతర్జాతీయ ఏజెన్సీలు భారతీయ రైల్వేకు భద్రతా సర్టిఫికెట్లు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.