ఎంబీబీఎస్ ప్ర‌వేశాల‌కు ఏప్రిల్ 30న వెబ్ ఆప్షన్లు

ఎంబీబీఎస్ ప్ర‌వేశాల‌కు ఏప్రిల్ 30న వెబ్ ఆప్షన్లు

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోట ఎంబీబీఎస్ సీట్లకు ఈ నెల 30న వెబ్ కౌన్సిలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయ‌ణ‌రావు ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యం నేడు అదనపు మాప్ అప్ నోటిఫికేషన్‌ను విడుద‌ల చేసింది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. మాప్ అప్ విడత కౌన్సిలింగ్ తరవాత ఖాళీ అయిన సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

సీట్ల ఖాళీల వివరాలను వెబ్ సైట్లో పొందుపర్చారు. ఈ నెల 30న ఉదయం 6 గంట‌ల నుంచి అదే రోజు సాయింత్రం 6 గంట‌ల వ‌ర‌కు వెబ్ ఆఫ్ష‌న్లను నమోదు చేసుకోవాలి. ఇప్ప‌టికే యూనివ‌ర్శిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్య‌ర్థులు ఈ విడ‌త వెబ్ కౌన్సిలింగ్‌లో పాల్గొన‌వ‌చ్చు. గత విడత కౌన్సిలింగ్ లో సీట్ అలాట్ అయి జాయిన్ కాకపోయినా, చేరి డిస్ కంటిన్యూ చేసినా అదే విధంగా అల్ ఇండియా కోటాలో ఇప్పటికే చేరినా అట్టి అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్ కు అనర్హులు. ఇత‌ర వివ‌రాల‌కు www.knruhs.telangana.gov.inవెబ్ సైట్లో సంప్ర‌దించాల‌ని యూనివ‌ర్శిటీ వ‌ర్గాలు సూచించాయి.