ఎంఐఎం కార్పొరేట‌ర్ గౌసుద్దీన్ అరెస్ట్

ఎంఐఎం కార్పొరేట‌ర్ గౌసుద్దీన్ అరెస్ట్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : భోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ ను పోలీసులు అరెస్టు చేశారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న పోలీసుల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించిన ఎంఐఎం కార్పొరేట‌ర్ మ‌హ్మ‌ద్ గౌసుద్దీన్‌ను ముషీరాబాద్ పోలీసులు నేడు అరెస్టు చేశారు. గౌసుద్దీన్‌పై 353,506IPCసెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. అనంత‌రం ఆ కార్పొరేట‌ర్‌ను పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో పోలీసు స్టేష‌న్ వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.ఎంఐఎం కార్పొరేట‌ర్ గౌసుద్దీన్ అరెస్ట్కార్పొరేట‌ర్ వ్య‌వ‌హార శైలిని ఓ నెటిజ‌న్ మంత్రి కేటీఆర్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి దృష్టికి ట్విట్ట‌ర్ ద్వారా తీసుకెళ్లారు. పోలీసుల‌కు గౌర‌వం ఇవ్వ‌కుండా దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆ నెటిజ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. ఇలాంటి నిర‌క్ష‌రాస్యుల ప్ర‌వ‌ర్త‌న‌ను స‌హించేది లేద‌ని ఆ వ్య‌క్తి పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ సీరియ‌స్‌గా స్పందిస్తూ.. ఆ వ్య‌క్తుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీకి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.