యాదాద్రిలోదారుణం..నలుగురు మృతి

యాదాద్రిలోదారుణం..నలుగురు మృతి

వరంగల్ టైమ్స్ , యాదాద్రి భువనగిరి జిల్లా : యాదగిరి గుట్టలో శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఓ పాత భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పలువురికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.యాదాద్రిలోదారుణం..నలుగురు మృతిభవనం శిథిలాల్లో మరికొందరు చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కూలిన రెండంతస్తుల భవనం 35 యేండ్ల క్రితం నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. మృతులను యాదగిరిగుట్టకు చెందిన దశరథ్ గౌడ్, శ్రీను, ఉపేందర్, శ్రీనాథ్ గా పోలీసులు గుర్తించారు.