శ్రీ భద్రకాళీ సన్నిధిలో తనికెళ్ల భరణి, దాస్యం

శ్రీ భద్రకాళీ సన్నిధిలో తనికెళ్ల భరణి, దాస్యం

వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : వరంగల్ మహానగరంలోని శ్రీ భద్రకాళీ దేవస్థానంలో వసంత నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా 7వ రోజు శుక్రవారం అమ్మవారికి లక్ష తెల్ల చామంతులతో పుష్పార్చన చేశారు. వసంత నవరాత్ర మహోత్సవాల్లో శుక్రవారం సామాన్య భక్తులతో పాటు ప్రముఖులు, ప్రజాప్రజానిధులు పెద్ద ఎత్తున పాల్గొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ భద్రకాళీ సన్నిధిలో తనికెళ్ల భరణి, దాస్యంఇందులో భాగంగా ప్రముఖ సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ దంపతులు భద్రకాళి దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయానికి వచ్చిన ప్రముఖులకు ఆలయ ఈఓ కె. శేషు భారతి, ప్రధానార్చకులు భద్రకాళి శేషులు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. పూజానంతరం ఆలయ స్నపనమండలంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దంపతులకు , తనికెళ్ల భరణికి వేదపండితులు, వేద విద్యార్థులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములను బహుకరించి ప్రసాదములు అందచేశారు.