ఆసియా క్రీడలకు మెంటార్ గా ఆనంద్ విశ్వనాథన్

ఆసియా క్రీడలకు మెంటార్ గా ఆనంద్ విశ్వనాథన్స్పోర్ట్స్ డెస్క్ : ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో భారత చెస్ బృందానికి దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ మెంటార్ గా వ్యవహరించనున్నాడు. సెప్టెంబర్ 11 నుంచి ప్రారంభంకానున్న ఈ టోర్నీ కోసం అఖిల భారత చెస్ సమాఖ్య ( ఏఐసీఎఫ్ ) కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఆనంద్ ను శనివారం మెంటార్ గా ప్రకటించింది. ‘ఆసియా క్రీడల్లో 4 స్వర్ణ పతకాలు సాధించడమే లక్ష్యం. ఈ టోర్నీలో భారత జట్టుకు దిగ్గజ గ్రాండ్ మాస్టర్ ఆనంద్ మెంటార్ గా వ్యవహరిస్తాడు. మహిళల, పురుషుల నుంచి పది మంది చొప్పున ఎంపిక చేసేందుకు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాం ‘ అని ఏఐసీఎఫ్ తెల్పింది.

ఆసియా క్రీడల్లో భారత్ తరపున పురుషుల్లో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగైసిన్ తో పాటు విదిత్ గుజరాతీ, హరికృష్ణ, నిహాల్ సరిల్, నారాయణన్, శశికిరణ్, అదిబన్, కార్తీకేయన్ మురళీ, అభిజిత్ గుప్తా, సూర్య శేఖర్ గంగూలీ ఎంపికయ్యే అవకాశం ఉంది. మహిళల జట్టులో కోనేరు హంటి, హారిక, భక్తి కుల్ కర్ణి, వాంతిక అగర్వాల్, సౌమ్య స్వామినాథన్, ఈషా కరవాడే, వైశాలి, తానియా సచ్ దేవ్, మేరీ ఆన్ గోమ్స్ పాల్గొనే అవకాశాలున్నాయి.