1వ డివిజన్ ప్రజలకు నా విజ్ఞప్తి

వరంగల్ అర్బన్ జిల్లా: 1వ డివిజన్ ప్రజలకు నా విజ్ఞప్తి. మన డివిజన్ లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేనథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని నా మనవి. అత్యవసరమైతే తప్ప రోడ్లమీదకు రాకండి. వస్తే మాస్కులు తప్పని సరిగా దరించండి. బయటకు వచ్చి మీ పనులు పూర్తి చేసుకున్న తరువాత. తిరిగి ఇంటికి వె‌ళ్లినాక మీ చేతులు సానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రంగా కడగండి. వేడివేడి ఆహార పదార్థాలు తినండి. గోరువెచ్చని నీళ్లు త్రాగండి. 1వ డివిజన్ ప్రజలకు నా విజ్ఞప్తిగుంపులు..గుంపులుగా తిరగకండి. వ్యక్తికి వ్యక్తికి కనీసం నాలుగు అడుగుల దూరం ఉండండి. అస్టచమ్మలు, క్యారంబోర్డులు, క్రికేట్ వంటి గ్రూప్ లకు సంబంధించిన ఆటలు ఆడకండి. ఇలా కొన్ని నిబంధనలు పాటించడం వల్ల కరోనా నుంచి మన డివిజన్, మన రాష్ట్రం, మన దేశాన్ని ఆరోగ్య దేశంగా మర్చుకోవచ్చును. కావున దయచేసి అందరు కరోనా నిబంధనలు పాటించండి. దగ్గు, జలుబు, ఆయాసం, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆందోళన చెందకుండా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించండి, ఎమర్జెన్సీ వుంటే నాకు సమాచారం ఇవ్వండి, నా వంతు సహాయ సహకారాలు అందిస్తా. కోవిడ్ బారిన పడినా, కోవిడ్ లక్షణాల లాంటివి కనిపించినా భయపడకుండా ఆత్మస్థైర్యంతో వుండండి. కరోనాను జయించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.