రెండు కుటుంబాలలో విషాదం

కరోన కాటుతో..భర్త దుర్మరణం.. దిక్కుతోచని స్థితిలో భార్య

వరంగల్: ఆ ఇద్దరు ఒక్కటయ్యారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమ అనే రెండక్షరాలు వారిని ఒక్కటి చేసింది కానీ విధి మాత్రం ఆ ప్రేమికులను బలితీసుకున్న ఘటన రెండు కుటుంబా లలో విషాదాన్ని నింపింది..ఎన్నో కలలతో నూతన జీవితాన్ని ప్రారంభించిన ఆ ప్రేమ జంటను కరోనా రక్కసి చిదిమేసి వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. తపాలా శాఖ లో పోస్టుమెన్ గా రెగ్యులర్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణులయ్యారు. ఇద్దరికీ కూడా ఒకే హెడ్ పోస్ట్ ఆఫీస్ లో పోస్టింగ్ రావడంతో ఇద్దరి మధ్య చనువు పెరిగింది.దాంతో వీరి చనువు కాస్త ప్రేమగా మారి ఇద్దరి అభిప్రాయాలతో ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాలలో విషాదంకులాల అడ్డంకి దాటి ప్రేమ వివాహం చేసుకున్నా ఆ జంటను చూసి కరోనా అసూయ పడినట్లు ఉంది.కరోనాతో కట్టుకున్న భర్త మరణించడంతో గర్భవతిగా ఉన్న భార్య ఏమి చేయాలో తెలియక అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడు తుంది.పూర్తి వివరాల్లోకి వెళితే..హనుమకొండ తపాల డివిజన్ పరిధిలో హనుమకొండ హెడ్ పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న రాజేందర్ గత కొన్ని సంవత్సరాల క్రితం తనతో పాటు పోస్టుఉమెన్ గా విధులు నిర్వహిస్తున్న సహచర ఉద్యోగినిని ఇరువురి అంగీకారంతో ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ మధ్యే తన భార్య పదోన్నతి పై హైదరాబాద్ లో ని జనరల్ పోస్ట్ ఆఫీస్ లో సార్టింగ్ అసిస్టెంట్ గా బాధ్యతలు తీసుకుని అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. అయితే రాజేందర్ కు తండ్రి తల్లితోపాటు తమ్ముడు కూడా ఉన్నాడు. గత పది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తల్లిదండ్రులకు ఆస్పత్రిలో చూపించగా కరోణ పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. అంతలోనే తనకు కూడా తీవ్ర జ్వరం, జలుబు రావడంతో జులై 1వ తేదీ నాడు కరోణ టెస్ట్ చేయించుకోవడంతో మూడు రోజులలో పాజిటివ్ రిపోర్టర్ రావడం జరిగింది దీంతో రాజేందర్ కూడా ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలోనే తల్లిదండ్రులిద్దరూ మృతి చెందారు.తల్లిదండ్రులు చనిపోయారని విషయం తెలియకుండానే ఈరోజు ఉదయం రాజేందర్ కూడా యశోద ఆసుపత్రిలో మృతి చెందడం జరిగింది.దీంతో భర్త అత్తమామలు కరోనా తో మృత్యువాత పడడంతో హైదరాబాదులో విధులు నిర్వహిస్తున్న ఆమె దిక్కుతోచని స్థితిలో ఉంది. రాజేందర్ తమ్ముడు కూడా జ్వరం జలుబుతో బాధపడుతున్నట్టు తెలిసింది.గర్భవతి గా ఉండి భర్త మరణించడంతో ఏమీ చేయని స్థితిలో ఆ తపాల ఉద్యోగిని చూసి తపాలా ఉద్యోగులు కన్నీటిపర్యంతమయ్యారు..