బలమైన పాత్రలు చెయ్యడానికి నేను రెడీ

బలమైన పాత్రలు చెయ్యడానికి నేను రెడీ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ జిల్లా : ఇటీవల థియేటర్స్ లో సందడి చేసిన సెహరి సినిమాలో మహాలక్ష్మి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుగమ్మాయి అక్షిత శెట్టి. మహాలక్ష్మి పాత్రలో అక్షిత శెట్టికి మంచి ఆదరణ లభించింది. ఈ రోల్ కు ముఖ్యంగా యువత నుండి మంచి అప్లాజ్ లభించడం విశేషం. ఫ్రెండ్స్ తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ చూసి మూవీస్ లో నటిస్తే బాగుంటుందని సూచించడంతో అక్షిత సెహరి సినిమాలో నటించడం జరిగింది. లెజండరీ నటుడు బ్రహ్మానందం స్ఫూర్తితో మరిన్ని మంచి రోల్స్ చేసి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలన్నది అక్షిత లక్ష్యం. నటనకు స్కోప్ ఉన్న రోల్స్ చేసి మరింత మంది ప్రేక్షకులకు చేరువవ్వాలనే ఉద్దేశంతో ఉంది అక్షిత. భవిష్యత్తులో అక్షిత శెట్టి మరిన్ని మంచి రోల్స్ తో పలకరించాలని ఆశిద్దాం.బలమైన పాత్రలు చెయ్యడానికి నేను రెడీ