ఎంజీఎం ఘటనపై సర్కార్ సీరియస్ యాక్షన్

ఎంజీఎం ఘటనపై సర్కార్ సీరియస్ యాక్షన్

ఎంజీఎం ఘటనలో సూపరింటెడెంట్ పై బదిలీ వేటు
గతంలో సూపరింటెండెంట్ గా ఉన్న చంద్రశేఖర్ కు పూర్తి బాధ్యతలు..
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్..ఎంజీఎం ఘటనపై సర్కార్ సీరియస్ యాక్షన్వరంగల్ టైమ్స్ , వరంగల్ జిల్లా :ఎంజీఎం ఘ‌ట‌న‌పై ప్రభుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నది. విష‌యం వెలుగులోకి వ‌చ్చిన వెంట‌నే వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు స్పందించారు. ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు త‌క్ష‌ణం నివేదిక రూపంలో పంపించాల‌ని, రోగికి నాణ్య‌మైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు వైద్యారోగ్య శాఖ అధికారులు, వివిధ విభాగాధిప‌తులు ఆర్ఐసీయు, ఆస్పత్రి ప్రాంగ‌ణం అంతా క్షుణ్ణంగా ప‌రిశీలించారు. ఘ‌ట‌న‌కు కార‌ణాల‌ను ఆరా తీసిన విచార‌ణ అధికారులు నివేదిక రూపొందించి ప్ర‌భుత్వానికి అందించారు. ఈ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకున్న‌ది.

ఎంజీఎం సూపరింటెండెంట్ ను బదిలీ చేయడంతో పాటు విధుల్లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించినందుకు గాను ఇద్ద‌రు వైద్యులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గతంలో ఎంజీఎం సూపరింటెండెంట్ గా ఉన్న చంద్రశేఖర్ కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.