ఏప్రిల్ 24 నుంచి స్కూల్స్ కి వేసవి సెలవులు

ఏప్రిల్ 24 నుంచి స్కూల్స్ కి వేసవి సెలవులు

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులను తెలంగాణ పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. అలాగే ఇది వరకే ప్రకటించిన పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మార్చింది. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 22 వరకు ఒకటవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతికి పరీక్షలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 23న ఫలితాల విడుదల, పేరెంట్స్ మీటింగ్, లాస్ట్ వర్కింగ్ డే ఉంటుంది. ఏప్రిల్ 24 నుంచి స్కూల్స్ కి వేసవి సెలవులుఆ తర్వాత ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయి. ఇది వరకు ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 16 వరకు ఒకటవ తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఫైనల్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ తాజాగా కొత్త షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది.