సీఎస్కే పై లక్నో ఘన విజయం 

సీఎస్కే పై లక్నో ఘన విజయం

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఐపీఎల్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో గురువారం జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రారంభ మ్యాచ్ లో తడబడినా రెండో మ్యాచ్ లో సీఎస్ కే వంటి మేటి జట్టుపై చివరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్ లో విజయం సాధించి సత్తా చాటింది. చెన్నై విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి ప్రత్యర్థికి గట్టి షాకిచ్చింది.సీఎస్కే పై లక్నో ఘన విజయం ఈ క్రమంలో కేఎల్ రాహుల్ సేన అరుదైన రికార్డు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో భారీ టార్గెట్ ను విజయవంతంగా ఛేదించిన నాలుగో జట్టుగా లక్నో నిలిచింది. కాగా, బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో, చెన్నైని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి చెన్నై 210 రన్స్ చేసింది. ఇక ఇందుకు బదులుగా సీఎస్ కే బౌలర్ ముఖేశ్ చౌదరి వేసవి ఆఖరి ఓవర్ మూడో బంతికి లక్నో యువ సంచలనం ఆయుష్ బదోని సింగిల్ తీసి తమ జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. దీంతో రెండో మ్యాచ్ తోనే క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో లక్నోకు గుర్తుండిపోయే విజయం దక్కింది. భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్ల జాబితాలో చోటు సంపాదించుకుంది.