కత్రినా, కౌశల్ ఒక్కటయ్యారు..

కత్రినా, కౌశల్ ఒక్కటయ్యారు..రాజస్తాన్ : బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి బంధంతో ఒక్కటైంది. గత కొంతకాలంగా ప్రేమంలో ఉన్న వీళ్లిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్తాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ లో ఈ జంట పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు సెలబ్రిటీలు వీరి వివాహానికి హాజరయ్యారు.

కొవిడ్ నేపథ్యంలో కొంతమంది అతిథులను మాత్రమే పెళ్లికి ఆహ్వానించారు. వీరి వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంట చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తూ మ్యారేజ్ విషెష్ తెల్పుతున్నారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.