ఢిల్లీ రోహిణి కోర్టులో పేలుడు కలకలం

ఢిల్లీ రోహిణి కోర్టులో పేలుడు కలకలంన్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ రోహిణి కోర్టులో మళ్లీ పేలుడు కలకలం సృష్టించింది. గురువారం ఉదయం రోహిణి గేట్ నంబర్ 102లో ఈ ఘటన చోటుచేసుకున్నది. పేలుడులో ఒకరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పేలుడు తక్కువ తీవ్రత కలిగిన బాంబు పేలుడు అని పోలీసులు నిర్ధారించారు.

ఒక్కసారిగా వచ్చిన భారీ శబ్దంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురై సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సైట్ నుండి ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం (IED)మరియు టిఫిన్ లాంటి వస్తువును స్వాధీనం చేసుకున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తగా రోహిణి కోర్టులో తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేశారు.

రోహిణి కోర్టు కాంప్లెక్స్‌లో ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ల్యాప్‌ టాప్ బ్యాగ్‌లో చిన్నపాటి పేలుడు సంభవించిందని ఢిల్లీ పోలీసులు ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని చుట్టుముట్టారు. ఫోరెన్సిక్ మరియు ఎన్‌ఎస్‌జి బృందాలు పరిశీలించి పరిశీలిస్తున్నాయి.

ఈ ఘటనపై ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం దర్యాప్తు చేస్తోంది. స్పెషల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ – లా అండ్ ఆర్డర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG)బృందాన్ని కూడా పిలిచారు. కోర్టు విచారణలో ఉండగా రోహిణి కోర్టులో ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో అనుమానాస్పద పేలుడు సంభవించింది.