ఒక కొత్త మోనోక్లోనల్ కు ఆథరైజేషన్ లభించింది

ఒక కొత్త మోనోక్లోనల్ కు ఆథరైజేషన్ లభించింది

హైదరాబాద్: ఆస్ట్రాజనికా వారి ఇవిషెల్డ్ (టిక్సగెవిమాబ్ మరియూ సిల్గావిమాబ్) ఇంజక్షన్ కి యుఎస్ ఎఫ్.డి.ఎ. ఎమర్జెన్సీ ఆథరైజేషన్ లభించింది. ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ మెడికల్ కండిషన్ ఉన్న వాళ్ళకి లేదా కరోనా వ్యాక్సిన్ కి సివియర్ రియాక్షన్ ఉన్నవాళ్లకి ఈ ఇంజక్షన్ ఉపయోగపడుతుంది. ఈ ఇంజక్షన్ అప్పటికే కోవిడ్ ఉన్న వాళ్లకి, కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఎక్స్పోస్ అయిన వాళ్ళకి ఇవ్వబడదు.

ఇవిషెల్డ్ రెండు సపరేట్ ఇంట్రామస్కులర్ ఇంజక్షన్స్ ద్వారా ఇవ్వబడుతుంది. ఈ ఇంజక్షన్ కరోనా రాకుండా ఆరు నెలలపాటు కాపాడుతుంది. ఇవిషెల్డ్ కరోనా వ్యాక్సిన్ల కు ప్రత్యామ్నాయం కాదు. 12 సంవత్సరాలు పై బడిన వాళ్ళందరికీ ఈ ఇంజక్షన్ ఇవ్వవచ్చు. ఆస్ట్రాజనికా వాళ్ళు చేసిన ప్రోవెంట్ అనే పరిశోధనలో 3,441 మందికి ఇవిషెల్డ్ ఇంజక్షన్ ఇచ్చిన తరువాత, ఆ తరువాతి ఆరు నెలల్లో  కోవిడ్ వచ్చే అవకాశం 77 శాతం తగ్గింది.

ఇప్పుడు అందుబాటులో ఉన్న రిజెనిరాన్ మోనోక్లోనల్ ఆంటీబాడీస్ కన్నా ఇవిషెల్డ్ ఎక్కువ కాలం పనిచేస్తుంది. ఆరునెలలపాటు కోవిడ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఈ ఇంజక్షన్ కాపాడుతుంది.

ఒమిక్రాన్ వేరియంట్ కి వ్యతిరేకంగా ఈ ఇవిషెల్డ్ ఇంజక్షన్ పని చేస్తుందా లేదా అన్న విషయం ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు.