12-14 యేళ్ల చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రారంభం

12-14 యేళ్ల చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రారంభం

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ఇప్పటి వరకు 15 యేండ్లు, ఆ పై వయస్సు గల వారికి కరోనా టీకా పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నది. తాజాగా 12 – 14 యేండ్ల చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్ కు చెందిన ‘బయాలాజికల్-ఈ’ సంస్థ తయారు చేసిన కార్బివాక్స్ టీకాను పిల్లలకు పంపిణీ చేస్తున్నారు. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నారు.12-14 యేళ్ల చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రారంభం2010 లేదా అంతకన్నా ముందు జన్మించి 12 యేండ్లు పూర్తి చేసుకున్నవాళ్లు టీకా తీసుకోవడానికి అర్హులని, వీళ్లంతా వ్యాక్సిన్ కోసం కొవిన్ పోర్టల్ లో పేరును నమోదు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒకవేళ 12 యేళ్లు నిండకపోతే పేరు నమోదు చేసుకున్నా టీకా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.

కొవిన్ పోర్టల్ లో పేరు నమోదు చేసుకుని ఇప్పటికే టీకా తీసుకున్న తల్లిదండ్రుల అకౌంట్ ద్వారా గారీ, లేదా కొత్త అకౌంట్ ( స్లాట్ ) ద్వారా గానీ పేరును నమోదు చేసుకోవచ్చు. అలాగే టీకా కేంద్రానికి వెళ్లి పేరును నమోదు చేసుకోవచ్చు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 2021 మార్చి 1 నాటికి 12-13 యేళ్ల వయస్సు చిన్నారులు 4.7 కోట్ల మంది ఉన్నారు.