భారత్ లో కొత్తగా 1109 కరోనా కేసులు

భారత్ లో కొత్తగా 1109 కరోనా కేసులు

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 1033 కేసులు నమోదయ్యాయి. తాజాగా అవి కాస్త 1109కి పెరిగాయి. దీంతో మొత్తం కేసులు 4,30,33,067 కు చేరాయి. ఇందులో 4,25,00,002 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 11,492 మంది చికిత్స పొందుతున్నారు. 5,21,573 మంది మృ తి చెందారు. కాగా గడిచిన 24 గంటల్లో 1213 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడగా, 43 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిందిభారత్ లో కొత్తగా 1109 కరోనా కేసులుమొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ఇక ఇప్పటివరకు 1,85,38,88,663 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, నిన్న ఒక్కరోజు 16,80,118 మందికి వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది.