ఏపీలో ఐఎయస్ ల బదిలీలు

అమరావతి:  ఆంథ్రప్రదేశ్ లో పలువురు ఐఎయస్ ల బదిలీలు జరిగాయి.ఈ మేరకు సీఎస్‌ సమీర్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. కేఎస్‌ జవహర్‌రెడ్డికి తితిదే ఈవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా జె.శ్యామలరావు, క్రీడలు, యువజనుల సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్‌, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శిగా ముఖేష్‌ కుమార్‌ మీనా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా ఎస్‌.సురేష్‌ కుమార్‌, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులుగా వి. చిన వీరభద్రుడు, సీసీఎల్‌ఏ జాయింట్‌ సెక్రటరీగా పి.రంజిత్‌ బాషా, చేనేత సంక్షేమశాఖ సంచాలకులుగా సి.నాగమణి, బీసీ సంక్షేమశాఖ సంచాలకులుగా పి.అర్జున్‌రావును బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.