50 మంది విద్యార్థులకు అస్వస్థత..ఎందుకంటే ?

50 మంది విద్యార్థులకు అస్వస్థత..ఎందుకంటే ?

వరంగల్ టైమ్స్, నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల విశ్వనగర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో సాంబారు, గుడ్డు తిన్న అనంతరం విద్యార్థులు వాంతులు చేసుకున్నారు.50 మంది విద్యార్థులకు అస్వస్థత..ఎందుకంటే ?పాఠశాల ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వహకులు వెంటనే స్పందించి అస్వస్థతకు గురైన విద్యార్థులను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆహార కలుషితమై వాంతులతో విద్యార్థులు చేరిన వెంటనే వారికి మెరుగైన చికత్స అందచేస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్ వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని, చికిత్స తర్వాత విద్యార్థులను డిశ్చార్జ్ చేస్తామని ఆయన అన్నారు.