8న ఎనుగల్ కు కేటీఆర్..పకడ్బంది ఏర్పాట్లు

8న ఎనుగల్ కు కేటీఆర్..పకడ్బంది ఏర్పాట్లు

8న ఎనుగల్ కు కేటీఆర్..పకడ్బంది ఏర్పాట్లు

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ఈ నెల 8న వర్ధన్నపేట నియోజకవర్గం పర్వత గిరి మండలం ఎనుగల్ కు మంత్రి కేటీఆర్ రానున్నారు. ఈ సందర్భంగా ఆ రోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. కావున ఈ భారీ బహిరంగ సభా స్థలం , అక్కడ హెలి ప్యాడ్, పార్కింగ్ ప్లేస్ లను, ఇతర ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ , వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్ లు కలిసి నేడు పరిశీలించారు.

అక్కడ చేయాల్సిన ఏర్పాట్లను మంత్రి దయాకర్ రావు అధికారులతో చర్చించారు. ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయనున్న మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని కేటీఆర్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రోజు ప్రారంభించనున్నారు. ఈ స్క్రీనింగ్ ని మహిళలు ఉపయోగించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి, బోయిన పల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేశ్ లు కోరారు.