బిగ్ బీ కు గాయాలు ? నిజమేనా ?

బిగ్ బీ కు గాయాలు ? నిజమేనా ?

బిగ్ బీ కు గాయాలు ? నిజమేనా ?

వరంగల్ టైమ్స్, ముంబయి : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు గాయాలయ్యాయి. ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా అనుకోకుండా ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన మూవీ టీం ఆయనను గచ్చిబౌలి ఏఐజీలో ఆస్పత్రిలో చేర్పించారు.

ఈ ప్రమాదంలో అమితాబ్ పక్కటెముకలకు గాయాలయ్యాయని, రెండు వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారు. ఏఐజీలో చికిత్స అనంతరం బిగ్ బీ ముంబయికి వెళ్లారు. అయితే తన ఆరోగ్యం విషయంలో ఫ్యాన్స్ ఎవరూ ఆందోళన చెందవద్దని అమితాబ్ తెలిపారు. తాను ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుంటానని పేర్కొన్నారు.

ఈ మేరకు తన ఆరోగ్యానికి సంబంధించిన అప్ డేట్ ను బ్లాగ్ లో రాసుకొచ్చారు. ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా ప్రాజెక్ట్ కే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్వకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

షూటింగ్‌లో ఎటువంటి ప్రమాదం జరగలేదు : నిర్మాత అశ్వినీదత్
అయితే ఇదంతా అవాస్తవమని నిర్మాత అశ్వినీదత్ తెలిపారు. షూటింగ్ లో ఎటువంటి ప్రమాదం జరుగలేదని తెలిపారు. ప్రాజెక్ట్ కే షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ కు ప్రమాదం అని వచ్చిన వార్తలు నిజం కాదని ఆయన చెప్పారు. మూడు రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుని అమితాబ్ ముంబై వెళ్లారని పేర్కొన్నారు. మా షూటింగ్ లో ఎటువంటి ప్రమాదం జరుగలేదని నిర్మాత అశ్వినీ దత్ వెల్లడించారు.