కడారి అఖిల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎర్రబెల్లి

కడారి అఖిల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎర్రబెల్లి

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : గత నాలుగు రోజుల క్రితం జర్మనీలోని ఓ నదిలో గల్లంతైన వరంగల్ కరీమాబాద్ కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి కడారి అఖిల్ కుటుంబాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. బుధవారం ఉదయం మంత్రి వరంగల్ కరీమాబాద్ లోని అఖిల్ నివాసానికి వెళ్లారు. అఖిల్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇప్పటి వరకు అఖిల్ ఆచూకీ దొరకపోవడం పట్ల తమకు సహకరించాలని అఖిల్ తల్లిదండ్రులు మంత్రిని, ఎమ్మెల్యేను వేడుకున్నారు.కడారి అఖిల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎర్రబెల్లిచేతికొచ్చిన కొడుకు గల్లంతుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అఖిల్ తల్లిదండ్రులను, కుటుంబసభ్యులను మంత్రి దయాకర్ రావు పరామర్శించి వారిని ఓదార్చారు. అఖిల్ గల్లంతుకు ముందు, గల్లంతు తర్వాత నెలకొన్న పరిస్థితులను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే అఖిల్ గల్లంతుపై జర్మనీ నుంచి సరైన సమాచారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు మంత్రిని వేడుకున్నారు.కడారి అఖిల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎర్రబెల్లితమ కొడుకు సజీవంగా ఇంటికి తిరిగి రావాలని రాష్ట్రప్రభుత్వాన్ని వేడుకున్నారు. కన్నీరుమున్నీరవుతున్న అఖిల్ తల్లిదండ్రులను, కుటుంబసభ్యులను మంత్రి ఓదార్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళి తగు సహాయక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంట వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ , స్థానికులు ఉన్నారు.