జూన్ 10న 57 రాజ్యసభ స్థానాలకు పోలింగ్
*ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో ఎన్నికలు
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : తెలంగాణ, ఏపీ సహా 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. ఈ యేడాది జూన్ 10న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున కౌంటింగ్ నిర్వహిస్తారు. ఏపీలో 4, తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, వైఎస్ చౌదరి (సుజనా చౌదరి), విజయసాయిరెడ్డిలు ఈ ఏడాది జూన్ 21న రిటైర్ కానున్నారు. తెలంగాణ నుండి డి.శ్రీనివాస్ (డీఎస్), వొడితెల లక్ష్మీకాంతరావులు రిటైర్ అవుతారు. తెలంగాణలో రాజ్యసభ స్థానానికి ఈ నెల 30న ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది.ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుండి బాలవర్మ, రాంవిచార్ నేతమ్, మధ్యప్రదేశ్ నుండి వివేక్ కృష్ణ, మొబేష జావేద్ అక్బర్, సంపతియా ఉకియా, తమిళనాడు నుండి టీకేఎస్ ఈలగోవన్, ఎ.నవనీతన్ కృష్ణన్, ఆర్ఎస్, భారతి, ఎస్ఆర్.బాలసుబ్రమణియన్, ఎ. విజయకుమార్ లు జూన్ లో రిటైర్ కానున్నారు. కర్ణాటక నుండి కేసీ రామ్మూర్తి, జైరామ్ రమేష్, ఆస్కార్ ఫెర్నాండెజ్, నిర్మలా సీతారామన్, ఒడిశా నుండి నెక్కంటి భాస్కర్ రావు, ప్రసన్న ఆచార్య, సస్మిత్ పత్రా, మహారాష్ట్ర నుండి పీయూష్ గోయల్, పి.చిదంబరం, ప్రపుల్ పటేల్, వికాస్ హరిబాబు, సంజయ్ రౌత్, వినయ్ ప్రభాకర్ లు జూలైలో రిటైర్ కానున్నారు.
పంజాబ్ నుండి అంబినా సోని, బల్వీందర్ సింగ్ రాజస్థాన్ నుండిఒం ప్రకాస్ మాధూర్, అల్పోన్స్ కన్ననాథం, రవికుమార్ వర్మ, హర్షవర్ధన్ సింగ్, యూపీ నుండి రేవత్ రమణ్ సింగ్, సుఖ్ మన్ సింగ్, సయ్యద్ జాఫర్ ,విశ్వంభర్ ప్రసాద్ నిషాద్, కపిల్ సిబల్, ఆశోక్ సిద్దర్ధాన్ నాథ్, జై ప్రకాష్, శివ్ ప్రతాప్, సతీష్ చంద్ర మిశ్రా, సంజయ్ సేథ్, సురేంద్ర సింగ్ లు జూలైలో రిటైర్ కానున్నారు. ఉత్తరాఖండ్ నుండి ప్రదీప్ తాంత, బీహార్ నుండి గోపాల్ నారాయణ సింగ్, సతీష్ చంద్ర దూబే, మీసా భారతి, శరద్ యాదవ్, రామచంద్ర ప్రసాద్ సింగ్, జార్ఖండ్ నుండి మహేష్ పొద్దార్, ముక్తార్ అబ్బాస్ నక్వీ లు జూలైలో రిటైర్ అవుతారు. హర్యానా నుండి దుశ్యంత్ గౌతం, సుభాష్ చంద్రలు ఆగష్టులో రిటైర్ కానున్నారు.
ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 24న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అదే రోజు నుండి నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు మే 31 వరకు గడువు విధించారు. జూన్ 1న నామినేషన్లను పరిశీలించనున్నారు. జూన్ 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. జూన్ 10న రాజ్యసభ ఎన్నికలను నిర్వహించనున్నారు. అదే రోజున కౌంటింగ్ నిర్వహిస్తారు.