సాహిత్య అకాడమీ చైర్మన్ గా జూలూరి గౌరీ శంకర్

సాహిత్య అకాడమీ చైర్మన్ గా జూలూరి గౌరీ శంకర్హైదరాబాద్ : తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గా జూలూరి గౌరి శంకర్ బుధవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ లు గౌరీశంకర్ ను అభినందించారు. ఈ సందర్భంగా జూలూరి గౌరీ శంకర్ మాట్లాడారు. సాహిత్యరంగాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల విశిష్టతను పుస్తకరూపంలో తీసుకొస్తానని ఆయన పేర్కొన్నారు.

సంస్కృతీ, సంప్రదాయాలు, కళల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అణగదొక్కబడిన వారికి స్వరాష్ట్రంలో ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర దేశంలోనే ఎక్కడా లేదని ఆయన గుర్తు చేశారు. ఉద్యమకారులకు అవకాశాలు వస్తాయని సమన్వయంతో ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందని ఆయన తెలిపారు.