సుప్రీంకోర్టుకు ఇద్ద‌రు కొత్త జ‌డ్జీల నియామ‌కం

సుప్రీంకోర్టుకు ఇద్ద‌రు కొత్త జ‌డ్జీల నియామ‌కం

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టుకు శుక్రవారం కొత్త‌గా ఇద్ద‌రు జ‌డ్జిల‌ను నియ‌మించారు. దీంతో సుప్రీంలో జ‌డ్జీల సంఖ్య 34కు చేరుకున్న‌ది. జ‌స్టిస్‌ రాజేశ్ బిందాల్‌, జ‌స్టిస్ అర‌వింద్ కుమార్‌ల‌కు పదోన్న‌తి క‌ల్పించారు. అల‌హాబాద్ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ఉన్న రాజేశ్ బిందాల్‌ గుజ‌రాత్ హైకోర్టు సీజేగా అర‌వింద్ కుమార్‌లు ఇక నుంచి సుప్రీంకోర్టు జ‌డ్జీలుగా కొన‌సాగుతున్నారు. రాజ్యాంగం ప్ర‌కారం రాష్ట్ర‌ప‌తి ఇద్ద‌రు కొత్త జ‌డ్జీల‌ను నియ‌మించిన‌ట్లు న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు తెలిపారు. సుప్రీంకోర్టు కొలీజియం ఆ ఇద్ద‌రు పేర్ల‌ను సిఫార‌సు చేసిన విష‌యం తెలిసిందే.