‘యశోద’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

'యశోద' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

హైదరాబాద్ : సమంత ప్రధాన పాత్రలో  రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

“తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఏక కాలంలో విడుదల చేస్తాం. ఈ నెల 6న `య‌శోద‌` చిత్రీక‌ర‌ణ మొద‌లుపెట్టాం. 24తో ఫస్ట్ షెడ్యూల్ పూర్త‌యింది. సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులపై  హైద‌రాబాద్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. ప్ర‌ముఖ న‌టులు రావు రమేష్, మురళీ శర్మ ఈ సినిమాలో ముఖ్య పాత్ర‌లు పోషించ‌నున్నారు. జనవరి 3న రెండో షెడ్యూల్ ప్రారంభించి 12 వరకూ చేస్తాం. మూడో షెడ్యూల్ జనవరి 20 నుంచి మార్చి 31 వరకూ నిర్విరామంగా జరుగుతుంది. దాంతో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. దర్శకులు ఇద్దరూ కొత్తవాళ్లు అయినప్పటికీ…ఎక్స్ ట్రార్డిన‌రీగా, కాన్ఫిడెంట్‌గా తెర‌కెక్కిస్తున్నారు.

కెమెరామెన్ సుకుమార్ కూడా అద్భుత‌మైన అవుట్‌పుట్‌ ఇస్తున్నారు. విజువ‌ల్‌గా, టెక్నిక‌ల్‌గా సినిమా చాలా గ్రాండియ‌ర్‌గా ఉంటుంది. ఖర్చు విషయంలో ఎక్క‌డా రాజీ పడటం లేదు. భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా చేస్తున్నాం” సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్త‌యిన సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ చెప్పారు.

సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగ‌ణం. ఈ చిత్రానికి  సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి, కెమెరా: ఎం. సుకుమార్,  ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి – హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.