మోడీ వ్యాఖ్యలపై రేపు నల్లజెండాలతో నిరసనలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాజ్యసభలో ప్రధాని మోడీ ఏపీ విభజనపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. అసలు ఏడున్నరేళ్లలో రెండు రాష్ట్రాలకు ఏం చేశారని నేతలు ప్రశ్నిస్తున్నారు. వీటికి కౌంటర్ గా బీజేపీ నేతలు రంగంలోకి దిగడంతో రాజకీయ వేడి పీక్స్ కు చేరుకుంది. అటు మోడీ వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ ఆందోళనలకు సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా 2022, ఫిబ్రవరి 9న బుధవారం నల్లజెండాలతో నిరసన తెల్పాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.